ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరికలు!

SMTV Desk 2019-05-31 12:49:00  sbi, sbi customers

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. మోసగాళ్ల వివిధ మార్గాల్లో బ్యాంక్ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నారు. అకౌంట్లలో నుంచి రూ.వేలకువేలు కొట్టేస్తున్నాయి. ఎస్ఎంఎస్‌లు, కాల్స్, ఈమెయిల్స్ వంటివి పంపి మోసం చేస్తున్నారు. ఎస్‌బీఐ వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు కస్టమర్లు అప్రమత్తం చేస్తూనే ఉంది. మోసగాళ్లు ఎస్ఎంఎస్‌, కాల్స్, ఈమెయిల్స్ వంటి వాటితో కస్టమర్లను ట్రాప్ చేయవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. మీరు లాటరీ గెలుచుకున్నారు.. మీ కార్డు బ్లాక్ అయ్యింది.. మీకు స్పెషల్ బోనస్ వచ్చింది.. వంటి మెసేజ్‌లు పంపొచ్చు. కస్టమర్లను ట్రాప్ చేసేందుకు మోసగాళ్లు ఇలా ఎస్ఎంఎస్‌లు లేదా ఈమెయిల్స్ పంపుతూ ఉంటారని, వీటికి స్పందించొద్దని హెచ్చరించింది. ఎలాంటి సమయాల్లోనైనా పాస్‌వర్డ్, పిన్, ఎంపిన్, ఓటీపీ వంటి వివరాలను ఎవరికీ చెప్పొద్దని, బ్యాంక్ ఇలాంటి వివరాలను ఎప్పటికీ అడగదని స్పష్టం చేసింది.సుక్షితమైన బ్యాంకింగ్ లావాదేవీల కోసం బ్రైజర్‌లో నేరుగా యూఆర్‌ఎల్‌ను టైప్ చేసి బ్యాంక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. ఏమైనా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు వాటి అథంటికేషన్ చూడాలని పేర్కొంది. ఈమెయిల్స్‌లో వచ్చిన లింక్‌లు ఓపెన్ చేయవద్దని తెలిపింది. అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకుంటే రివార్డు పాయింట్లు ఇస్తామని పేర్కొంటున్నా కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.