భారత సైన్యానికి అధునాతన క్షిపణి

SMTV Desk 2017-08-28 15:18:38   An advanced missile for the Indian Army, The enemy aircraft and helicopters are missiles, Capacity

న్యూఢిల్లీ, ఆగస్టు 28 : భారత సైన్యం సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. 2020 నాటికల్లా అధునాతన మధ్యతరహకు ఉపరితల నుంచి గగనతలలోకి ప్రయోగించే ఎంఆర్‌ ఎస్ ఏ ఎం క్షిపణులు సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి. 70 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, హెలికాప్టర్ లు క్షిపణుల్ని కుల్చాగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో తో ఇజ్రాయెల్ కు చెందిన ఏరోస్పస్ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా క్షిపణి వ్యవస్థను రూపొందించాయి. ప్రస్తుతం నౌకాదళం వాయు సైనాకు ఎం ఆర్ ఎస్ ఏ ఎం అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ఐఏఐ తో, డీ ఆర్ డీ వో 17 వేల ఒప్పందాలను కుదుర్చుకుంది. భద్రత సవాల్ ను దృష్టిలో పెట్టుకుని గగనతల దాడుల సామర్ధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్న సైన్యం, కొన్నాళ్ళుగా ఎం ఆర్ ఎస్ ఏ ఎం వ్యవస్థ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.