సరిలేరు నీకెవ్వరూ... సూపర్ టైటిల్ .. సంబరాల్లో ఫాన్స్

SMTV Desk 2019-05-31 12:30:01  mahesh babu, sarileru nikevvaru,

ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ 75వ పుట్టిన రోజు, ఈ సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు నూతన సినిమా టైటిల్‌ ను నిన్న అర్ధరాత్రి సినిమా డైరెక్టర్ అనిల్, మహేష్ బాబులు ప్రకటించారు. ఇక మహేష్ నూతన సినిమా టైటిల్‌‌ను కృష్ణ ప్రకటించారు. ఈ వీడియోను ఎఫ్2తో హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి చిత్ర టైటిల్‌ను ప్రకటించడానికి ఇంత కంటే గొప్ప సందర్భం ఏముంటుందని ఆయన కృష్ణ గారి నోటి నుంచి టైటిల్ ఏంటో వినండంటూ ట్వీట్ చేశారు. సరిలేరు నీకెవ్వరూ చిత్రం మహేశ్ బాబుకు 26వ సినిమా కానుంది. ఈ చిత్రం 2020 సంక్రాంతి బరిలో నిలుస్తుందని కృష్ణ తెలిపారు.

సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన సూపర్ స్టార్ కి గోల్డెన్ ఎరా మొదలవుతోందని ఈ వీడియోలో పేర్కొన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్స్ ని ప్రకటించలేదు. ఇక మహేష్ ట్వీట్ చేస్తూ ‘నా జీవితానికి స్ఫూర్తి, నా తండ్రి, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు’ అని కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. సరిలేరు నీకెవ్వరు టైటిల్ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. సంక్రాంతి 2020 బరిలో ఈ చిత్రం నిలుస్తుందని తెలిపారు. ఇక ఈ సినిమా ముహూర్తం ఈ రోజు 9 : 18 నిముషాలకి అని పేర్కొన్నారు, ఇక ఈ సినిమా పోస్టర్ ని బట్టి ఇందులో మహేష్ ఆర్మీ మ్యాన్ గా కనిపించానున్నాడని అంటున్నారు.