పర్వేజ్ ముషారఫ్​కు సీరియస్

SMTV Desk 2019-05-31 12:28:13  Musharaf, pakistan,

దుబాయ్: పాకిస్థాన్ మాజీ మిలటరీ జనరల్ పర్వేజ్ ముషారఫ్​(75) మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. నాడీ మండలం దెబ్బ తినడంతో కొంతకాలంగా ఆయన ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నారు. నడవలేకపోతున్నారు. గురువారం ఉన్నట్టుండి సీరియస్ కావడంతో హుటాహుటిన దుబాయ్ లోని ఆస్పత్రికి తరలించినట్లు ‘ది నేషన్’ పత్రిక పేర్కొంది.

రెండేళ్లలో ముషర్రాఫ్ ఆస్పత్రి పాలు కావడం ఇది 40వ సారి. 2007లో పాకిస్థాన్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు ముషర్రాఫ్ పై కేసు కొనసాగుతోంది. ఈ కేసు ప్రూవ్ అయితే ముషర్రాఫ్ కు మరణదండన లేదా జీవిత ఖైదు శిక్షగా పడుతుంది. కేసు తదుపరి విచారణ జూన్ 12న జరగాల్సివుంది.