స‌మంత ఫోటోపై నెటిజ‌న్ల ఆగ్రహాం!!

SMTV Desk 2019-05-31 12:20:24  samantha akkineni

నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడ‌లైన త‌ర్వాత కూడా హీరోయిన్ స‌మంత‌ సినిమాల‌తో బిజీగానే ఉంది. నిజం చెప్పాలంటే పెళ్లి త‌ర్వాత ఆమె కెరీర్ మ‌రింత జోరందుకుంది. న‌టిగా కూడా ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. గ్లామ‌ర‌స్‌గా క‌నిపించేందుకు కూడా సై అంటోంది. సోష‌ల్ మీడియాలోనూ త‌న హాట్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తోంది.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స‌మంత పోస్ట్ చేసిన ఓ హాట్ ఫోటో ట్రోలింగ్‌కు గుర‌వుతోంది. ఈ ఫోటోపై నెటిజన్లు విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ఒక‌రికి భార్య‌గా మారిన త‌ర్వాత కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

"స‌మంత మేడ‌మ్‌.. నేను మీకు పెద్ద అభిమానిని. కానీ, ఇప్పుడు ఈ ఫోటో చూసి బాధ‌ప‌డుతున్నాను. మీరు ఒక గొప్ప కుటుంబానికి కోడలు", "మీరు చాలా సెక్సీగా ఉన్నారు. అయితే మీకు పెళ్లి అయింది అనే విష‌యాన్ని అర్థం చేసుకోలేక‌పోతున్నారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రి, ఈ కామెంట్ల విష‌యంలో స‌మంత ఎలా స్పందిస్తుందో చూడాలి.