ఆంధ్రలో కేసీఆర్ క్రేజ్ అంతా....ఇంతా కాదు

SMTV Desk 2019-05-31 11:55:54  KCR, ANdhra,

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీలో కూడా మంచి క్రేజ్ ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు రిటర్న్ గిఫ్త్ ఇస్తానని పేర్కొన్నారు. అయితే ఆయన అన్న మాటలు అప్పటి నుంచి బాగా వైరల్ అయ్యాయి. అసలు కేసీఆర్ ఎందుకు ఆ మాటలు అన్నాడంటే తెలంగాణలో ఎన్నికల సమయంలో కూటమి పొత్తులో భాగంగా చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే కేసీఆర్‌పై పదే పదే ఆరోపణలు చేస్తూ తన కొరివితో తనే కాల్చుకున్నాడు. అయితే ఆ ఎన్నికలలో కేసీఆర్ గెలవడం మళ్ళీ సీఎం అవ్వడం జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి చంద్రబాబును ఏపీలో ఎలాగైన ఓడించాలి అని అనుకున్నాడు. అందుకే ముందు నుంచే జగన్‌కి మద్ధతు తెలుపుతూ వచ్చాడు.

అయితే కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుంది అని అందరిలోనూ ఆసక్తి నెలకుని ఉండింది. అయితే జగన్ గెలుపే చంద్రబాబుకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ అని అందరికి అర్ధమైపోయింది. నేడు జగన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగాగా విజయవాడకు విచ్చేసిన కేసీఆర్‌కు జగన్ సాదర స్వాగతం పలికారు. అయితే బెజవాడ ప్రజలు కూడా అదే రీతిలో స్వాగతం పలికారట. జగన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన కేసీఆర్‌కు థాంక్స్ కేసీఆర్ సార్.. చంద్రబాబుకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు అని పెద్ద పెద్ద బ్యానర్లు కూడా కట్టించారట. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సంబంధాలు ముందు ముందు మరింత బాగా మెరుగవ్వాలని, వైఎస్ జగన్ సారథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలని మరో 20 ఏళ్ళ వరకు ఏపీకీ జగనే పాలననందించాలని ప్రజలకు చెప్పారు. అంతేకాకుండా తెలుగు ప్రజలు ఆత్మీయతతో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధించాలని కోరారు.