ఇమ్రాన్ తాహిర్ పై పేలుతున్న జోక్స్

SMTV Desk 2019-05-31 11:54:47  imran tahir

లండన్: దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇమ్రాన్ తన బౌలింగ్ లో వికెట్ పడితే ఏ రేంజ్ లో సంబరపడతాడో మనకు తెలిసిందే. అయితే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ లో ఇమ్రాన్ తాహిర్ వేసిన మొదటి ఓవర్‌లో రెండో బంతికే ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో ఔట్ అయ్యాడు. అయితే ఇమ్రాన్ తాహిర్ వికెట్ తీసిన సంబరంతో మైదానంలో కలియతిరగ్గా.. అతను సంబరాలు జరుపుకున్న తీరుపై నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. పలు మార్ఫింగ్ ఫొటోలతో ట్వీట్లు చేస్తున్నారు.ఇమ్రాన్ వికెట్ తీసిన ఆనందంలో తనను తాను మరిచిపోయి ఇంగ్లండ్ దాటి బయటకు వచ్చాడని ఒకరు ఫొటో పోస్ట్ చేయగా, మరొకరు ఇమ్రాన్ వికెట్ తీసిన ఆనందంలో పరిగెత్తుతూ మంచు ఖండానికి వెళ్లిపోయాడని ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఇమ్రాన్‌పై ఇప్పుడు ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి. గతంలోనూ ఇమ్రాన్ ఏ తరహా మ్యాచ్ అయినా సరే.. వికెట్ తీస్తే ఆనందంతో స్టేడియంలో వేగంగా పరిగెత్తుతాడు. అదే విషయంపై ఎప్పటికప్పుడు ఇమ్రాన్ తాహిర్‌పై జోకులు వస్తుంటాయి. దీంతో ఇప్పుడు కూడా అతని అభిమానులు జోకులు పేలుస్తున్నారు.