అందుకే 'ఎన్టీఆర్' బయోపిక్ చూడలేదు

SMTV Desk 2019-05-31 11:48:54  teja

ఎన్టీఆర్ బయోపిక్ తీసే ఛాన్స్ క్రిష్ కంటే ముందుగా తేజాకి దక్కింది. దాదాపు ఈ బయోపిక్ కి దర్శకుడిగా ఆయన రంగంలోకి దిగిపోయారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. " ఎన్టీఆర్ బయోపిక్ ను నేను చూడలేదు. ఎందుకంటే నేను ఆ సినిమా చూస్తే ఎలా ఉందని మీడియావారు అడుగుతారు. ఉన్నది వున్నట్టుగా చెప్పడం నాకు అలవాటు. అలా చెప్పడం వలన అది వివాదానికి దారితీస్తుంది. ఇలా నిర్మొహమాటంగా మాట్లాడటం వలన లేనిపోని తలనొప్పులు ఎదురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందువలన తాను ఆ సినిమాను చూడకపోవడమే మంచిదనే ఉద్దేశంతోనే చూడలేదు" అని అన్నారు.