ఏపీలో జగన్ ప్రమాణస్వీకారం.. తెలంగాణలో సంబరాలు!

SMTV Desk 2019-05-30 19:35:07  ys jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీతో పాటు తెలంగాణలోని వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కేకులు కోసి, బాణసంచాలు కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైసీపీ నేతలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఖమ్మం జిల్లాలో వైసీపీ నేతలు స్వీట్లు పంచుకుని, కేకులను కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు. హైదరాబాద్ లో జగన్ చదువుకున్న ప్రగతి మహా విద్యాలయలో ఆయన స్నేహితులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు చెన్నైలో వైసీపీ నేతలు అన్నదానం నిర్వహించారు. వెయ్యి మందికి బిరియానీ అందజేశారు.