'గేమ్ ఓవర్' ట్రైలర్ చూడండి!!

SMTV Desk 2019-05-30 19:34:18  tapsee

తెలుగు .. తమిళ భాషల్లో అవకాశాల పరంగా వెనుకబడిపోయిన తాప్సీ, హిందీలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోంది. అక్కడ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె హిందీలో గేమ్ ఓవర్ అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేసింది.

అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హారర్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై మరింత ఆసక్తిని పెంచేదిలా వుంది. హిందీతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోను ఈ సినిమాను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తన ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ చేరనుందనే నమ్మకంతో తాప్సీ వుంది.