శంకర్ - ప్రభాస్ సినిమా గురించి కోలీవుడ్ టాక్

SMTV Desk 2019-05-30 19:27:04  shankar

శంకర్ తాజా చిత్రంగా భారతీయుడు 2 చాలా వేగంగా సెట్స్ పైకి వెళ్లింది. అయితే షూటింగుకి ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూ వస్తున్నాయి. దర్శక నిర్మాతల మనస్పర్థల కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్త షికారు చేస్తూనే వుంది. ఈ నేపథ్యంలో శంకర్ దృష్టి ప్రభాస్ పై పడిందనీ, ప్రభాస్ హీరోగా ఆయన ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేసే పనిలో వున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న రెండు సినిమాల షూటింగు పూర్తికాగానే, శంకర్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టనున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది శంకర్ సన్నిహితుల మాట. ప్రస్తుతం శంకర్ .. భారతీయుడు 2 కి సంబంధించిన పనులతోనే బిజీగా ఉన్నాడనీ, ఆ తరువాత ప్రాజెక్టు గురించిన ఆలోచన ఆయన ఇంకా చేయలేదని చెబుతున్నారు. అందువలన శంకర్ - ప్రభాస్ కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో లేదనే అనుకోవాలి.