అమెరికా ఆయుధ తయారీ రంగంపై చైనా వేటు

SMTV Desk 2019-05-30 19:25:13  china, america, trade war between america and china

వాషింగ్టన్‌: అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత పెరిగేల ఉంది. చైనాకు చెందిన ఓ పత్రిక అమెరికాకు సరఫరా చేసే అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో కోత విధించాలంటూ ఓ కథనం ప్రచురించిది. దీంతో అమెరికా ఆయుధ తయారీ రంగానికి షాక్ ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకోవాలని చైనా ప్రభుత్వానికి ఆ పత్రిక సూచించింది. చైనా సాంకేతిక రంగ సంస్థలకు పరికరాలు, టెక్నాలజీ అందకుండా అమెరికాకు బుద్ధి చెప్పేలా చైనా వద్ద చాలా ఉపాయాలున్నాయని పేర్కొంది. గత కొన్నేళ్లుగా చైనా అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ఈ దేశంలో పర్యావరణ పరిరక్షణ వంటి ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడ మైనింగ్‌ పెరిగిపోయింది. ఫలితంగా 2014, 2017లో ప్రపంచంలో ఉత్పత్తి అయిన అరుదైన ఖనిజాల్లో చైనా నుంచి వచ్చిన వాటా 80శాతానికి పైమాటే. ఈ దేశం నుంచి ఏటా 160 మిలియన్‌ డాలర్ల విలువైన ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి. వీటిల్లో చాలా ఖనిజాలను ఆయుధాల తయారీకి వినియోగిస్తారు. దీంతో వీటిపై ఆంక్షలు తొలుత రక్షణ రంగాన్ని ప్రభావితం చేయనున్నాయి.