యూజర్ కు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన ఐఆర్‌సీటీసీ

SMTV Desk 2019-05-30 19:23:04  irctc

రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ యాప్ లో పోర్న్ యాడ్స్ రావడంతో ఓ యూజర్ ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశారు. ‘ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ యాప్‌లో అశ్లీల, అసభ్య ప్రకటనలు (యాడ్స్) ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. చిరాకు కలిగిస్తోంది’ అని అనంద్ కుమార్ అనే యూజర్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. దీనికి రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఆర్‌సీటీసీ, పీయూష్ గోయెల్‌ను కూడా ట్యాగ్ చేశారు. అయితే ఇతనికి ఇండియన్ రైల్వేస్ సేవ నుంచి దిమ్మతిరిగే సమాధానం వచ్చింది. ‘ఐఆర్‌సీటీసీ యాడ్స్ సేవల కోసం గూగుల్ యాడ్ సర్వీసింగ్ టూల్ ఏడీఎక్స్‌ను ఉపయోగించుకుంటుంది. యూజర్లకు బ్రౌజింగ్ హిస్టరీ, కుక్కీస్ ఆధారంగా వివిధ రకాల యాడ్స్ కనిపిస్తుంటాయి. అందువల్ల బ్రౌజింగ్ హిస్టరీ, కుక్కీస్, ఇతర డేటాను డిలేట్ చేయండి’ అని రిప్లే వచ్చింది.