జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార హైలైట్స్

SMTV Desk 2019-05-30 19:21:40  Jagan Mohan reddy, oath taking ceremony,

నవ్యంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా యువ జన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు.జగన్ ప్రమాణ స్వీకారంకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది.జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గాను ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి కొన్ని అంశాలు ప్రధాన హైలైట్ గా నిలిచినా అంశాలను ఇప్పుడు గమనిద్దాం.

*జగన్ తన మొట్టమొదటి సంతకం ప్రతీ వృద్ధునికి పించనును 2250 రూపాయలు ఇస్తానని పెట్టడం.దశల వారీగా దాన్ని 3000 వరకు తీసుకెళ్లడం. దీనికి “వైఎస్సార్ పెన్షన్” అనే నామకరణ కూడా చేసారు.

*కెసిఆర్ ఇరు రాష్ట్రాల వారు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి అని ఇంకో 4 టర్మ్ ల వరకు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పిన స్పీచ్.

*మూడు మతాలను కలిపి ఆశీర్వాదం తీసుకోవడం.

*ఇక చివరిగా “జగన్ అనే నేను” అంటూ ఉద్వేగభరితంగా ఇచ్చిన జగన్ స్పీచ్ అన్నిటికన్నా ప్రధాన హైలైట్ అని చెప్పాలి.

*ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి వేతనాన్ని మాత్రమే తీసుకుంటానని చెప్పడం.

*రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి సంబంధించి ఒక విలేజ్ వాలంటీర్ ను పెట్టి ఉద్యోగ కల్పన చేపట్టి నెలకు 5000 జీతం అందివ్వడం.ఆగస్టు 15 కల్లా ఈ విలేజ్ వాలంటీర్ల సంఖ్య 4 లక్షలకు పెంచడం.

*కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా గ్రామ సెక్రటేరియట్ మరియు ముఖ్యమంత్రి కాల్ సెంటర్ లో ఉద్యోగాలు పరికల్పన.