ఇంజెక్షన్లతో భారీగా కండలు పెంచేసాడు...!

SMTV Desk 2019-05-30 19:13:08  man increased his muscles in injections

పురుషులు కండరాలను ఎక్కువగా పెంచేందుకు అనేక కసరత్తులు చేస్తూ ఉంటారు. గుండె మీద భారం పడుతుంది అని అటు వైద్యులు, జిమ్ ట్రైనర్లు హెచ్చరించినప్పటికీ తొందరగా రావాలని కొందరు జిమ్ములో విపరీతంగా వ్యాయామం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌కు చెందిన వాల్దిర్ సెగాటో(50) ఓ బాడీ బిల్డర్. అంతర్జాతీయంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను పెంచిన కండల పట్ల అతడికి సంతృప్తిలేదట. హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్‌లా భారీ సైజు కండలు పెంచాలన్నది అతడి ఆశయం. అలాంటప్పుడు రోజూవారి కసరత్తుల కన్నా ఇంకాస్త ఎక్కువ చేయాలి కానీ, ఈయన నువ్వుల నూనెను ఒంట్లోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు. అలా చేస్తే కండరాలు ఉబ్బెత్తుగా తయారవుతాయట. నువ్వుల నూనెలో పెయిన్ కిల్లర్స్, ఆల్కహాల్ కలిపి ఆ మిశ్రమాన్ని సిరంజీల ద్వారా కండరాల్లోకి ఎక్కించేవాడు. ఇది చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరించినప్పటికీ అతను వినిపించుకోవడంలేదు. ధమనులు పూర్తిగా మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, ఇన్ఫెక్షన్లు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అయినా అవన్నీ జాన్తా నై అన్నట్టు 23 అంగుళాల కండలు పెంచడమే పనిగా పెట్టుకున్నాడు. గత మూడేళ్ళుగా సెగాటో కండపుష్ఠి కోసమే కృషి చేస్తున్నాడు.