సౌతిండియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా......

SMTV Desk 2019-05-30 19:11:53  salman khan

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. సినిమాల్లో వరుస విజ‌యాల‌ను సాధిస్తూ అగ్ర హీరోగా దూసుకెళ్తున్నారు. సినిమాల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లోనూ తార‌క్ స్పీడును పెంచారు. రీసెంట్‌గా పార్లే అగ్రో డ్రింకింగ్ ప్రొడ‌క్ట్ అయిన ఫిజ్‌కు ఎన్టీఆర్ సౌతిండియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించడానికి అంగీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఫిజ్‌కు బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్ ఇండియా అంతటా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. కానీ ఇక‌పై సౌతిండియాకు సంబంధించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో ఎన్టీఆర్ క‌న‌పించ‌నున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్, రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి `ఆర్ ఆర్ ఆర్` సినిమాలో న‌టిస్తున్నారు.