ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

SMTV Desk 2019-05-30 19:09:35  England vs south Africa, icc world cup

ప్రపంచకప్ టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేకపోయిన ఈ రెండు జట్లూ కనీసం ఈ సారైనా విజేతగా నిలవాలని ఆశిస్తున్నాయి. దీంతో.. ఘన విజయంతో టోర్నీలో ఈరోజు బోణి కొట్టాలని రెండు టీమ్స్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో సూపర్ ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, జోరూట్, జోస్ బట్లర్ మిడిలార్డర్‌ని బలోపేతం చేస్తున్నారు. ఇక ఆల్‌రౌండర్లు బెన్‌స్టోక్స్, మొయిన్ అలీ, పేసర్లు జోప్రా ఆర్చర్, క్రిస్‌ వోక్స్, ఫ్లంకెట్ ఇంగ్లాండ్‌ని తిరుగులేని స్థితిలో నిలుపుతున్నారు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా మ్యాచ్‌ల్ని మలుపు తిప్పగల సమర్థుడే. ప్రపంచకప్‌లో ఒత్తిడిని జయించలేని జట్టుగా తమపై పడిన ముద్రని కనీసం ఈసారైనా చెరిపేసుకోవాలని సఫారీలు ఆశిస్తున్నారు. సీనియర్ ఓపెనర్ హసీమ్ ఆమ్లా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నా.. డికాక్ నిలకడగా ఆడున్నాడు. ఇక మిడిలార్డర్‌లో కెప్టెన్ డుప్లెసిస్, జేపీ డుమినీ, డేవిడ్ మిల్లర్ ఆ జట్టుకి ప్రధాన బలం. మరోవైపు ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ గాయపడటంతో ఆల్‌రౌండర్ క్రిస్‌మోరీస్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది.

South Africa (Playing XI): Hashim Amla, Quinton de Kock(w), Aiden Markram, Faf du Plessis(c), Rassie van der Dussen, Jean-Paul Duminy, Andile Phehlukwayo, Dwaine Pretorius, Kagiso Rabada, Lungi Ngidi, Imran Tahir

England (Playing XI): Jason Roy, Jonny Bairstow, Joe Root, Eoin Morgan(c), Ben Stokes, Jos Buttler(w), Moeen Ali, Chris Woakes, Liam Plunkett, Jofra Archer, Adil Rashid.