ట్రయంఫ్ బైక్స్‌పై భారీ డిస్కౌంట్స్

SMTV Desk 2019-05-30 18:32:07  triumph bikes discount

ట్రయంఫ్ బైక్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ లో ఏకంగా సగానికి పైగా తగ్గింపు లభిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఒక డీలర్ 30 డెమో, ప్రి-ఓన్డ్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌పై అదిరిపోయే తగ్గింపు అందిస్తున్నారు. ఈ బైక్స్ ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. స్ట్రీట్ ట్విన్ బైక్‌కు ఈ ధర వర్తిస్తుంది. ఇక బొన్నెవిల్లే టీ120 ధర రూ.6.5 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌వి. ఈ బైక్స్ 2016-18 మధ్యలో తయారయ్యాయి. బ్రాండ్ న్యూ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే ఈ డీలర్ ఆఫర్ చేసే బైక్స్‌ ఏకంగా 55 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి ఆఫర్. ఎక్కువ మొత్తం ఖర్చు చేయకుండా, అందుబాటు ధరకే బైక్స్ లభిస్తున్నాయి.