4 గంటలకు కేంద్ర కేబినెట్ జాబితా.. 4.30 గంటలకు కొత్త మంత్రులతో మోదీ భేటీ

SMTV Desk 2019-05-30 18:12:58  modi

కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త కేబినెట్ ఖరారైంది. మోదీ, అమిత్ షాలు కొత్త మంత్రులను ఎంపిక చేశారు. కేబినెట్ లో స్థానం సంపాదించిన వారికి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రుల జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది. అనంతరం, సాయంత్రం 4.30 గంటలకు కేబినెట్ లో స్థానం సంపాదించిన నేతలతో మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీకి అమిత్ షా కూడా హాజరవనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.