వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్

SMTV Desk 2017-08-28 12:49:33  India, Srilanka, ODI series 2017, Third Odi, Pallekele odi

పల్లెకెల, ఆగస్ట్ 28: భారత్-శ్రీలంక మధ్య పోరులో గత టెస్ట్ సిరీస్ నుండి విజయ పథంలో రాణిస్తున్న టీమిండియా తాజాగా నిన్న పల్లెకెలలో జరిగిన మూడవ వన్డే‌లో గెలుపు మార్గాన నిలిచింది. దీంతో గత టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ నేటి వన్డే సిరీస్ కూడా 3-0తో చేజిక్కించుకుంది. ఆదివారం మూడవ వన్డేలో 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్ల నష్టంతో లక్షాన్ని చేధించింది. భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (124) సెంచరీ చేయగా, శిఖర్ ధావన్ 5, కోహ్లీ 3, కేఎల్ రాహుల్ 17 పరుగులు చేసి వికెట్లు కోల్పోయారు. ధోనీ 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. లంక బౌలర్లలో ధనంజయ రెండు వికెట్‌లు, మలింగ, ఫెర్నాండో‌లు చెరో వికెట్ తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 217పరుగులు చేసింది.