వైద్యశాస్త్రంలో మరో అరుదైన ఘనత: 245 గ్రాములు ఉన్న పసికూనను కాపాడిన వైద్యులు

SMTV Desk 2019-05-30 15:41:55  Worlds smallest surviving baby

న్యూయార్క్: వైద్యశాస్త్రంలో మరో అరుదైన ఘనత చోటుచేసుకుంది. ఓ గర్భవతికి బిపి పెరగడంతో 23 వారాలకే పుట్టిన బిడ్డను వైద్యులు అతికష్టం మీద ప్రాణాలు కాపాడారు. వివరాల ప్రకారం...అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో ఓ గర్భవతికి బిపి పెరగడంతో 23 వారాలకే బిడ్డను ప్రసవించింది. దీంతో బిడ్డ పుట్టినప్పుడు 245 గ్రాములు ఉంది. తక్కువ బరువుతో పుట్టిన పాప శ్వాస తీసుకోవడానికి బలం కూడా లేదని, 24 గంటలు కూడా బతకడం కష్టమని శాండిగో ఆస్పత్రి వైద్యులు ఆ పాపను ఇంక్యూబెటర్‌లో పెట్టారు. అలా ఆ తండ్రి గంటలు లెక్కిస్తూ వచ్చాడు, గంటలు మారాయి రోజులు కూడా మారాయి బిడ్డ బతికి బయటపడింది. వైద్యశాస్త్రంలో ఇదోక మిరాకిల్ అని వైద్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. తన కుమార్తె తనకు దక్కడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దేవుని దయవల్లే తన పాప బతికిందన్నారు. కష్టపడి తన బిడ్డను బతికించిన వైద్యులకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. పాప ప్రాణం పోసుకోవడంతో ఆస్పత్రి వైద్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాప బరువు 2.2 కిలోలు ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జీవితాంత పాప ఆరోగ్యంగా ఉండాలని మనందరం దీవిద్దాం. ఎడ్వర్డ్ బెల్ అనే వైద్యుడు ప్రపంచంలో తక్కువ బరువు బేబీ అని తెలిపారు. వైద్యులు ఆ పాపకు సైబీ అని పేరు పెట్టారు.