దాణా కుంభకోణంలో 16 మందికి జైలు శిక్ష

SMTV Desk 2019-05-30 15:30:39  dana scam,

దాణా కుంభకోణంలో 16 మందికి జైలు శిక్ష ఖరారు దాణా కుంభకోణం కేసులో రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు 16 మంది నిందితులకు జైలు శిక్ష ఖరారు చేసింది. చైబాసా ట్రెజరీ నుండి రూ.37 కోట్లు డ్రా చేసినట్లు ఆధారాలు లభించడంతో కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో 11 మందికి మూడు సంవత్సరాలు, అయిదుగురికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు బుధవారం తీర్పునిచ్చిందని సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రభుత్వ న్యాయవాది ఎస్‌ఎన్‌ మిశ్రా తెలిపారు.2013 లో బీహర్‌ మాజి సిఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జగన్నాధ మిశ్రా లపై కేసు నమోదు చేసిన విషయం విదితమే.

అనంతరం మరో 16 మందిపై సిబిఐ చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. దాణా కుంభకోణం కేసులో లాలూకు రాంచీ స్పెషల్‌ సిబిఐ కోర్టు శిక్ష విధించింది.ఈ కేసులో లాలూ తో సహా ఏడుగురికి కోర్టు శిక్షను ఖరారు చేసింది.లాలూ తో సహా మిగితా దోషులు ఫూల్‌ చంద్‌, మహేశ్‌ ప్రసాద్‌, బకె జులియస్‌, సునీల్‌ కుమార్‌, సుశీల్‌ కుమార్‌, సుధీర్‌ కుమార్‌, రాజారామ్‌ కు మూడున్నర జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానాను కోర్టు విధించింది.