పవన్ కళ్యాణ్‌ను ఇష్టపడటానికి ఇదే కారణం : నరేష్

SMTV Desk 2019-05-30 13:43:56  Naresh, Pawan kalyan

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని మరీ మొదటిసారి పోటీకి దిగినటువంటి జనసేన పార్టీకి గోరమైన ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీ కేవలం ఒకేఒక్క స్తానం లో గెలుపొంది, తమకు ఓటు బ్యాంకు సరిగా లేదని తెలుసుకుంది జనసేన… కాగా జనసేన అధినేత పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు జనసైనికులు… అయితే పవన్ ఓటమిపాలవడంతో ప్రత్యర్థులు అందరు కూడా ఆయనను గేలి చేస్తున్నారు. కానీ ఈ పరాజయంతో జనసేన పార్టీకి ఎలాంటి ఓట్లు రానప్పటికీ కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా, నూతన రాజకీయాలకు పవన్ శ్రీకారం చుట్టారు. అయితే ప్రస్తుతానికి ఎవరైనా గెలిచినా వారితో కలవాలనుకుంటారు కానీ పవన్ చూపించిన నిస్వార్థమైన రాజకీయాలకు మెచ్చి ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్‌ తో కలవడానికి ‘మా’ అధ్యక్షుడు నరేష్ చెప్పారు.

కాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి హాజరైన నరేష్ మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఊహించని రీతిలో ప్రశంసలు గుప్పించారు. తనకు రాజకీయాలంటే అసలే నచ్చావని, కానీ పవన్ మీద ఉన్న అభిమానంతో పవన్ తో కలుస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా “డబ్బులకు అతీతంగా రాజకీయాలు చేసే రోజు వచ్చినప్పుడు దేశం బాగుపడుతుందని, రాజకీయాల్లో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వారు.. అంతకు నాలుగైదు రెట్లు రాబడతారని, ఈలోగా జైలుకు వెళ్లడానికి సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు. డబ్బు పంచకుండా పోటీ చేస్తాను అని అన్నాడు, చేసి చూపించాడు. గెలిచాడా లేదా తరవాత సంగతి కానీ మార్పుకు నాంది పలికాడు, అందుకని పవన్ కళ్యాణ్‌ను ఇష్టపడటానికి ఇదే కారణమ”ని నరేశ్ తెలిపారు. త్వరలోనే పవన్ కలిసి జనసేన పార్టీలో చేరిపోయి తనవంతు సహాయం చేస్తానని నరేష్ అన్నారు. అంతేకాకుండా డబ్బుతో కూడిన రాజకీయాలను కట్టడి చేయడానికి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ లాంటి శక్తులు కలిసి రావాలని నరేశ్ పిలుపునిచ్చారు.