టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో తానేమి డేటింగ్ లో లేనని స్పష్టం చేశారు ప్రముఖ బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్. అతనితో తాను డేటింగ్‌పై వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కావాలనుకునే వాళ్లకి ఇలాంటి వదంతులతో అవసరం ఉంటుందని.. తనకు అలాంటి వాటితో పనిలేదని ఆమె వివరించారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ మంచి క్రికెటర్. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. గొప్పవాడు. తాను అతనితో డేటింగ్‌లో లేను. ఈ విషయంలో ఇంకేమైనా స్పష్టత కావాలంటే ఈ వార్తలను పుట్టించిన వాళ్లని అడగవచ్చు అంటూ సోనాల్ చౌహాన్ తెలిపారు.
అదేవిధంగా కేఎల్ రాహుల్ పై కొన్ని రోజుల క్రితం ఇలాంటి వార్తే ఒకటి వినిపించింది. అదేమంటే.. నటి నిధి అగర్వాల్‌తో అతడు డేటింగ్‌లో ఉన్నట్లు గౌసిబ్స్ బయటికొస్తే.. వాటిని వారిద్దరూ ఖండించారు కూడా. కాగా రాహుల్ ప్రస్తుతం వరల్డ్ కప్ మెగాటోర్నీ కోసం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. జూన్ 5నుంచి టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.