ప్రమాణస్వీకారానికి పవన్ వస్తాడా? క్లారిటీ ఇచ్చిన జనసేనాని

SMTV Desk 2019-05-30 13:41:27  Pawan Kalyan, jagan,

ఏపీకి రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నాడు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చాలా మంది ప్రముఖులని జగన్ ఆహ్వానించాడు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఉన్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే కెసిఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా, చంద్రబాబు రాలేక తన అధికార ప్రతినిధులను పంపనున్నారని సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి రావడం పై ఎలాంటి అధికార స్పష్టత ఇప్పటి వరకు కూడా రాలేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.

అంతేకాకుండా ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ని మరొక సందర్భంలో కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారని సమాచారం. కాగా పవన్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. తన జనసేన పార్టీకి సంబందించిన కొన్ని ప్రణాళికలు చేయడంలో కొందరు పెద్దలతో ఏర్పాటు చేసుకున్న చర్చల కారణంగా హాజరు కాలేకపోతున్నారని జనసేన వర్గాల సమాచారం. కానీ జగన్ ఫోన్ చేసినపుడు చాలా ప్రశాంతంగా మాట్లాడుకున్నారని, రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరని, రాజకీయాలను మనసులో పెట్టుకొని ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరు అవ్వొద్దని జగన్ అన్నట్లు సమాచారం.