తెలంగాణలో పింఛనుదారులకు శుభవార్త... నెలవారీ మొత్తం రెట్టింపు

SMTV Desk 2019-05-30 13:16:08  telangana

తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పథకం కింద పింఛన్లు అందుకుంటున్న 39 లక్షల మందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నెలవారీ పెన్షన్ ను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇకమీదట దివ్యాంగులకు రూ.1500కి బదులుగా రూ.3016, వృద్ధులు, వితంతువులు, ఇతరులకు ఇస్తున్న రూ.1000కి బదులుగా రూ.2016 ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ నెల నుంచి ఈ ఎన్నికల హామీ అమలు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెంపును మే నెల నుంచే అమలు చేయాలని భావించినా, వరుసగా ఎన్నికల కోడ్ లు రావడంతో కార్యరూపం దాల్చడంలో జాప్యం జరిగింది.