చంద్రదర్శన వెబ్‌సైట్‌ ప్రారంభించిన పాకిస్తాన్

SMTV Desk 2019-05-30 13:13:22  chandradarshan

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ తాజాగా చంద్రదర్శన అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. రంజాన్‌, ఈద్‌ పండుగల నిర్ణయానికి ఆధారమైన చాంద్రమాన మాసారం భాలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాలకు తెరదించుతూ ఈ నిర్ణయం తీసుకుంది. www.pakmoonsighting.pk అనే పేరుతో ఈ వెబ్‌సైట్‌ ఆదివారం నాడు ప్రారంభమైంది. తాము శాస్త్రీయ చాంద్రమాన కేలండర్‌ను రూపొందిస్తున్నట్లు పాక్‌ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫవాద్‌ చౌదరి ప్రకటించిన రెండు వారాలకే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభం కావటం విశేషం. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ముస్లింల ప్రధాన పండుగలయిన రంజాన్‌, ఈదుల్‌ ఫితర్‌, ఈదుల్‌ అఝా, మొహర్రం వంటి వాటిపై కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.