ఇంకా వారం ఉంది: భువీ

SMTV Desk 2019-05-30 13:12:35  bhuvaneshwar kumar, icc world cup

మంగళవారం న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీంఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడాడు. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వారు బాగా రాణించారు. ప్రపంచకప్‌లో బాగా ఆడడానికి ఈ విజయం ఉత్సాహాన్నిస్తుందిగ అని తెలిపాడు. ప్రపంచకప్‌లో ఆటను గెలుపుతో ప్రారంభించాలని మనం ఎల్లప్పుడూ భావిస్తాం. అయితే, ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌ ఆడడానికి మాకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. గెలుపుకోసం మా ప్రణాళిక ఏంటో ప్రస్తుతం నేను చెప్పలేను. మేము సాధన చేస్తున్న సమయంలో, సమావేశం అయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో ఎలా ఆడాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటాము అని భువీ తెలిపాడు.