విజయ్ దేవరకొండ నటన అద్భుతం : కేటీఆర్

SMTV Desk 2017-08-28 10:54:56  arjun reddy movie, minister kcr, vijay devarakonda.

హైదరాబాద్, ఆగస్ట్ 28 : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "అర్జున్ రెడ్డి" సినిమా కొన్ని వివాదాస్పద పరిణామాల మధ్య విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కుమ్మరించారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటన ఇరగదీశాడు, చాలా సహజత్వంతో నిజాయితీని ప్రతిబింబించే విధంగా ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రం మనసుకు హత్తుకుపోయేలా ఉందంటూ, ఇలాంటి రిస్కీ చిత్రాలు తీయాలంటే ఎంతో ధైర్యం కావాలంటూ కేటీఆర్ కితాబిచ్చారు.