పవన్ కల్యాణ్ ను ప్రశ్నించిన రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2019-05-30 12:16:20  pawan kalyan

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి పరోక్ష విమర్శలు గుప్పించారు. పదో క్లాస్ లో 32 మార్కులతో పాసై, ‘తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు’ అని చెప్పింది ఎవరని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వర్మ ప్రస్తావించారు. ‘కింద ప్రస్తావించిన మాటలన్నీ ఎవరు చెప్పారు? నేను ఊరికే అడుగుతున్నా’ అంటూ ఓ క్లిప్ ను వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అందులో ‘జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు. జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా. పాకిస్థాన్ తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు’ అంటూ వేర్వేరు సందర్భాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్ చేశారు.