డ్యూయెల్ డిస్‌ప్లేతో ఆసస్ నయా ల్యాప్‌టాప్

SMTV Desk 2019-05-29 15:22:53  ASUS ZenBook Pro Duo

ప్రముఖ టెక్ కంపెనీ ఆసస్ మరో ల్యాప్‌టాప్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. జెన్‌బుక్ ప్రో డియో పేరుతో రిలీజ్ అయిన ఈ ల్యాప్‌టాప్ లో రెండు స్క్రీన్స్ ఉంటాయి. డ్యూయెల్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ. ఈ లాప్‌టాప్‌లో 14 అంగుళాల సెకండరీ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్ యాప్స్ కూడా ఉంటాయి. ఇకపోతే ల్యాప్‌టాప్‌లో 4కే అల్ట్రా హై డెఫినేషన్ ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్, 4కే స్క్రీన్ ప్యాడ్ ప్లస్, టచ్‌ప్యాడ్ వంటి ఫీచర్లున్నాయి. ఆసస్ నానో ఎడ్జ్ డిజైన్‌తో ఈ ల్యాప్‌టాప్స్ రూపొందాయి. అంటే బెజిల్‌లెస్ స్క్రీన్స్ ఉంటాయి. కంపెనీ దీనితోపాటు ఆసస్ జెన్‌బుక్ డియో అనే మరొక ల్యాప్‌టాప్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులో14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ నానో ఎడ్జ్ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే 12.6 అంగుళాల స్క్రీన్ ప్యాడ్ ప్లస్ కూడా ఉంది. ఇందులో ఇంటెల్ ఐ7 ప్రాసెసర్, జీఫోర్స్ ఎంఎక్స్250 జీపీయూ ఉంటుంది. ఇక జెన్‌బుక్ ప్రో డియోలో 9వ జనరేషన్ ఇంటెక్ కోర్ ఐ9 ప్రాసెసర్ ఉంటుంది. 32 జీబీ రామ్ ఉంటుంది. న్విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 2060 జీపీయూ ఉంటుంది. 1 టెరాబైట్ మెమరీ ఉంటుంది. ఈ రెండు ల్యాప్‌టాప్స్ 2019 సెప్టెంబర్ కల్లా మార్కెట్‌లోకి రావొచ్చు. ధర తెలియాల్సి ఉంది.