అమెరికా మానిటరింగ్‌ లిస్ట్‌ నుంచి ఇండియన్ రూపాయి తొలగింపు

SMTV Desk 2019-05-29 15:15:39  america, India, India currency roopay,

వాషింగ్టన్‌: అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వాముల కరెన్నీ మానిటరింగ్‌ లిస్ట్‌ భారత కరెన్సీ రూపాయిని తొలగించారు. అయితే అమెరికాకు అనుకూలంగా భారత్‌ పలు చర్యలు తీసుకోవడంతో వాషింగ్టన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా భారత్‌కు ఈ జాబితాలో ఉండాలంటే అవసరమైన మూడు పరిస్థితుల్లోఒక్కటి అయిన వాణిజ్య మిగులు మాత్రమే ఉంది. ఇలా వరుసగా రెండు సార్లు ఉండటంతో జాబితా నుంచి తొలగించాము అని అమెరికా ట్రెజరీ విభాగం నివేదికలో పేర్కొంది. అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలకు సంబంధించి మైక్రోఎకనామిక్స్‌, విదేశాంగ విధానాలపై దీనిని రూపొందించారు. ఈ నివేదికను కాంగ్రెస్‌కు సమర్పించారు. అయితే ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు స్విట్జర్లాండ్‌ కరెన్సీని కూడా తొలగించారు. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్‌, సింగపూర్‌, మలేసియా, వియత్నాంల కరెన్సీలు మాత్రం దీనిలో కొనసాగుతున్నాయి.