ఏటీఎంలో డబ్బులు రాకపోతే....ఖాతాలోకి రోజుకి రూ.100

SMTV Desk 2019-05-29 15:13:19  atm

ఏటీఎం మిషిన్లల్లో అప్పుడప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో మనకు డాబులు కావాల్సినప్పుడు ఇటువంటి సమస్యలు ఇంకా అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు ఏటీఎం మెషీన్‌ వద్దకు వెళ్లి డబ్బు డ్రా చేయాలని ప్రయత్నించారు. కానీ ఏటీఎంలో నుంచి డబ్బులు రాలేదు. కానీ అకౌంట్‌లో నుంచి డబ్బులు మాత్రం డెబిట్ అయ్యాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు ఏడు రోజులలోపు మీ డెబిట్ అమౌంట్‌ను మళ్లీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తాయి. ఒకవేళ 7 రోజులు దాటిన తర్వాత కూడా మీ బ్బులు అకౌంట్లోకి రాకపోతే.. అప్పుడు సంబంధిత బ్యాంక్ మీకు రోజుకు రూ.100 ఇస్తుంది. ఈ రూల్ 2011 జూలై 11 నుంచే అమలులోకి వచ్చింది. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన తర్వాత మీరు మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. మీరు ఫిర్యాదు చేయకపోతే మీకు ఎలాంటి పరిహారం లభించదు. లావాదేవీ ఫెయిల్ అయిన 30 రోజులలోపు ఫిర్యాదు చేసి ఉండాలి. మీరు ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 7 పని దినాల్లోగా బ్యాంక్ మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఒవవేళ పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.