ఆఖరి రోజు కాకినాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్

SMTV Desk 2017-08-27 18:40:54  kakinada muncipal elections, y.s. jagan, ysrcp jagan, y.s rajashekar reddy,

కాకినాడ ఆగస్ట్ 27: కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులనే కాక ఆయన అధికారంలోకి వచ్చాక రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసారు. కాకినాడలో వర్షం పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చంద్రబాబుని ప్రశ్నించారు? ఇక్కడ మొత్తం 17 ప్రాంతాలు మునుగుతాయని, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని లేనిపోనీ హామీలు అన్ని కురిపిస్తూ పోటీపడుతున్నాడు. మూడు సంవత్సరాలలో నెరవేర్చని హామీలను మూడు గంటలలో నెరవేరుస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఇక్కడి డ్రైనేజి వ్యవస్థ ఎంత అద్వానంగా ఉందంటే, మురుగునీరు అంతా రోడ్ల పైకి వచ్చి ప్రజలను ఇబ్బందిపెడుతూ, త్రాగే నీటిలో కూడా ఈ మురుగునీరు చేరి అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఇదే అదునుగా పందులు, వీధి కుక్కలు రోడ్లపై స్వైర విహారం చేస్తుంటే ఇప్పుడు వచ్చి నగరవాసులకి చంద్రబాబు నాయుడు హమీలిస్తున్నాడు", అని ఆయనపై ద్వజం ఎత్తారు.