ప్రీమియం చెల్లించకపోయినా లక్షల్లో ఇన్సూరెన్స్

SMTV Desk 2019-05-29 14:42:49  insurance

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఎంతో కొంత ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాలసీలకు వేల రూపాయల ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.1, కొన్ని సందర్భాల్లో ఇంతకన్నా తక్కువ చెల్లించినా సరిపోతుంది. రూ.1కి మూడు ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ✺ క్యాబ్ సేవల సంస్థ ఓలా తన ప్యాసింజర్లకు ట్రిప్ ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. డైలీ రైడ్స్‌కు ఒక్క రూపాయి, ఓలా రెంటల్స్‌కు రూ.10, ఓలా ఔట్‌స్టేషన్స్‌కు రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. వీటి వల్ల రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది. డ్రైవర్ క్యాన్సలేషన్ వల్ల ఫ్లైట్ మిస్ కావడం, అనుకొని కారణాల వల్ల ఆలస్యం కావడం, వైద్య ఖర్చులు, బ్యాగేజ్ లాస్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వంటి వాటికి ఈ కవర్ వర్తిస్తుంది.✺ ఐఆర్‌సీటీసీ తన ప్లాట్‌ఫామ్‌ నుంచి ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకుంటే రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ను ఉచితంగా అందిస్తోంది. అదే రైల్వే టికెట్లను బుక్ చేసుకుంటే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందొచ్చు. దీనికి 49 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. రైల్వే ప్రమాదంలో రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తి మరణిస్తే.. కుబుంబ సభ్యులకు రూ.10 లక్షలు అందుతాయి. అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, హాస్పిటల్ ఖర్చులకు రూ.2 లక్షలు అందిస్తారు. మృత దేహాల తరలింపునకు రూ.10,000 ఇస్తారు. ✺ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రమాద బీమా పథకాన్ని అందిస్తోంది. దీని పేరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఈ పాలసీ వార్షిక ప్రీమియం రూ.12. అంటే నెలకు రూ.1. పాలసీదారుడు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు అందుతాయి. అంగవైకల్యం సంభవిస్తే రూ.1 లక్ష ఇస్తారు.