మూడో వన్డే లో భారత లక్ష్యం 218పరుగులు

SMTV Desk 2017-08-27 18:38:16  India, Srilanka, ODI series, Third Odi, Pallekele odi

పల్లెకెల, ఆగస్ట్ 27: మూడవ వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 217 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా లక్ష్యం 218 పరుగులు మాత్రమే. అయితే ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలనే తపనతో ఉన్న లంకేయులు భారత్‌ని కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు. లంకేయుల బ్యాటింగ్‌లో డిక్ వెల్లా (13), చండీమాల్ (36), మెండీస్ (1), తిరుమన్నె (80), మ్యాథ్యూస్ (11), కప్గదెరె (14), సిరివర్ధన(29), ధనన్ జయ (2), చమీరా (6), ఫెర్నాండో 5 పరుగులతో, మలింగా ఒక్క పరుగుతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లు బుమ్రా ఐదు, పాండ్యా, అక్షర్ పటేల్, జాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీసారు.