మరో రెండు ఫోన్స్ ను లాంచ్ చేసిన రెడ్‌మి

SMTV Desk 2019-05-29 12:26:45  xiaomi, redmi k 20, redmi k 20 pro

చైనాకు చెందినా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షావోమి తాజాగా మరో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ను లాంచ్ చేసింది. రెడ్‌మి కే20, రెడ్‌మి కే20 ప్రో పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్లు బీజింగ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేసింది. రెడ్‌మి కే 20 ప్రో ఫోన్‌లో 6.39 అంగుళాల స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+13 ఎంపీ+ 8 ఎంపీ), ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, 20 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ప్రత్యేకతలున్నాయి. బ్యాటరీ 74 నిమిషాల్లో ఫుల్ అవుతుంది. రెడ్‌మి కే20 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్.. రెడ్‌మి కే20 ప్రో ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది. ఇక రెండింటిలో మిగతా ఫీచర్లన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి. రెడ్‌మి కే20 ప్రో రూ.25,000 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్/64 జబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.26,000గా, 8 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.30,000గా ఉంది.మరోవైపు రెడ్‌మి కే20 ధర రూ.20,000 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.21,000గా ఉంది. రెడ్‌మి కే20 ప్రో స్మార్ట్‌ఫోన్స్ జూన్ 1 నుంచి చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి. ఇక కే20 ఫోన్స్ జూన్ 6 నుంచి కస్టమర్ల ముందుకు వస్తాయి.