కవిత కోసం రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు

SMTV Desk 2019-05-29 12:06:37  Kavitha, Harish rao,

ఇటీవల తెలంగాణాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత గోరమైన పరాజయం పాలైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అందరిలో కాస్త ఉత్కంఠ మొదలయింది. కాగా ప్రస్తుతానికి కవిత హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనుందని, అందుకోసం కసరత్తులు కూడా చేస్తున్నారని సమాచారం. ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిజామాబాద్ లో ఓటమి తరువాత కవిత కాస్త అసంతృప్తికి లోని సరిగా బయటకు రావడమే మానేశారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి ముందుగా కవితని రాజ్యసభకు పంపిద్దామం నిర్ణయించుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్యకారణాల వలన కెసిఆర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని సమాచారం. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో విరాజయం సాధించి మల్లి తన సత్తా చాటాలనుకున్న కెసిఆర్ కవితను హుజూర్ నగర్ ఎమ్మెల్యే నిలపాలని భావిస్తున్నారట.

కాగా హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు హుజూర్ నగర్ లో ఉపఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కవితను నిలబెట్టాలని, ఆమెను గెలిపించే బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెరాస శ్రేణుల సమాచారం. అంతేకాకుండా కవిత గెలిస్తే మహిళా కోటాలో కవితకి మంత్రి పదవి కూడా అప్పగించాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారంట.