రమణ దీక్షితులుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా

SMTV Desk 2019-05-29 12:00:19  Ramana Deeskhitulu, jagan,

వైసీపీ అధినేత ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తనని ఆలయంలోకి అనుమతించడంలేదని రమణ దీక్షితులు.. జగన్ కి తెలిపారు. ఈ విషయంలో రమణదీక్షితులుకు జగన్ భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. రేపు ఆలయంలో కలుద్దామని చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

కాగా నిన్న వైఎస్‌ జగన్‌ తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కడప జిల్లాకు బయలుదేరుతారు. కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుంటారు. ప్రత్యేక ప్రార్థనల తర్వాత చాదర్‌ను సమర్పించనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా కడప నుంచి పులివెందులకు చేరుకుంటారు. సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.