ముస్లిం సోదరులకు తెలంగాణ సీఎం ఇఫ్తార్ విందు

SMTV Desk 2019-05-29 11:55:19  KCR, iftar vindu

తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కేసీఆర్. అది ఎప్పుడంటే... జూన్ 2వ తేదీన ముస్లిం సోదరులకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ సర్కార్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యకరమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. అయితే సాయంత్రం ఏడు గంటలకు మొదలయ్యే ఈ ఇఫ్తార్ విందుకు పలువురు నాయకులు.. ముస్లిం ప్రముఖులు హాజరు కానున్నారు.