ఈ అమ్మాయిలే ఇప్పుడు నా రూం లో రూంమేట్స్‌..

SMTV Desk 2019-05-29 11:54:17  ramgopalvarma, rgv,

గ‌తంలో తాను ఇంజనీరింగ్ చ‌దివిన సిద్దార్ధ ఇంజ‌నీరింగ్ కాలేజీనీ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్శ సందర్శించారు. కాలేజీ పరిసరాల్లో తిరుగుతూ గ‌త‌స్మృతులను నెమ‌రువేసుకున్నారు. ఇందులో భాగంగా.. కాలేజీ రోజుల్లో తాను ఉన్న‌ హాస్టల్ గదిని సందర్శించారు. కాగా, తాను చదువుకునే రోజుల్లో బాయ్స్ హాస్టల్ ఉన్న భవనం కాస్త ఇప్పుడు గర్ల్స్ హాస్టల్‌గా మారింద‌ని వర్మ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ గదిలో ఉంటున్న విద్యార్థినులతో ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అనంతరం తన పర్యటనకు సంబంధించిన విషయాల‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పుడు రెండు సంవత్సరాలు ఇదే గదిలో ఉండేవాడిని. ఇది మా కాలేజీ వెనకాల ఉంటుంది. నా ఇంజనీరింగ్ కాలేజీ జీవితం దాదాపు ఇక్కడే గడిచింది. కానీ ఇప్పుడు దీనిని గర్ల్స్ హస్టల్‌గా మార్చారు. ఇదిగో ఈ లవ్‌లీ గర్ల్సే ఇప్పుడు ఈ గదిలో రూంమేట్స్‌గా ఉంటున్నారు. నేను నిలుచుకున్న వెనకాలే శ్రీదేవి ఫొటో ఒకటి ఉండేది. దాన్ని నేనే అంటించాను’’ అని విద్యార్థినులతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ వర్మ రాసుకొచ్చారు.