‘కేఏ పాల్‌ డబ్బులు తీసుకుని మోసం చేశాడు..’

SMTV Desk 2019-05-29 11:32:56  ka paul,

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను అమెరికా పంపిస్తానంటూ కేఏ పాల్ మోసం చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనకు స్పాన్సర్ షిప్ లెటర్, ఇన్విటేషన్ కార్డును కేఏ పాల్ ఇచ్చారని ఆమె పోలీసులకు తెలిపింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్ లెటర్ ఇస్తామని పాల్ తన నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని సత్యవతి ఆరోపించారు. ‘విజిట్ వీసా స్పాన్సర్‌షిప్ లెటర్ ఇస్తామని కేఏ పాల్, అతని అనుచరులు రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. చివరికి డీల్‌ను రూ.2 లక్షలకు ఓకే చేశారు. నేను రెండు లక్షల రూపాయలకు చెక్కు ఇచ్చాను. దాన్ని బ్యాంకులో వేసి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత నాకు స్పాన్సర్‌షిప్ లెటర్ ఇవ్వకుండా.. నా ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు..’ అని వివరించింది.

కాగా ఈ మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్‌ నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగి డిపాజిట్‌ కోల్పోయిన విషయం తెలిసిందే.