భారత్ కు వ్యవసాయ సబ్సిడీల విషయంలో ఎదురుదెబ్బ

SMTV Desk 2019-05-29 11:30:53  india

భారత్ కు వ్యవసాయ సబ్సిడీల విషయంలో విదేశాలు మొండిచేయి చూపేలా దాఖలాలు కనబడుతున్నాయి. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ప్రధానంగా వ్యవసాయ సబ్సిడీలకు కోత విధించేట్టు జపాన్ చేయనున్న ఓ ప్రతిపాదన...అయితే ప్రధానంగా వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ టీ ఓ) నిబంధనలను మార్చే దిశగా సాగుతోంది. కాగా ఈ ప్రతిపాదనను అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు సమర్థించనున్నాయి. ఇప్పటికే సబ్సిడీ నోటిఫికేషన్ ప్రాసెస్ లో వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొంత వివాదంలో పడింది. వ్యవసాయ సబ్సిడీలు ఎంత కావాలో, ఏ మేరకు అవసరమో ఖఛ్చితంగా తెలియజేయాలన్నది ఈ నిబంధనల్లో ఒకటి.. దీన్ని తెలియజేయకపోతే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందట. వ్యవసాయంపై డబ్ల్యు టీ ఓ ఒప్పందం ప్రకారం ఒక పేద, లేదా వర్ధమాన దేశం తన వ్యవసాయోత్పత్తుల విలువలో 10 శాతానికి పైగా సబ్సిడీలను కోరజాలదు. అయితే ధనిక దేశాల విషయంలో ఇది 5 శాతం ఉంది. భారత్-చైనా దేశాలు తమ సబ్సిడీల విషయంలో వక్రీకరించి నివేదికలు ఇస్తున్నాయని అమెరికా సహా పలు ధనిక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ దేశాలు గ్లోబల్ ట్రేడ్ ను తప్పుదారి పట్టిస్తున్నాయని తప్పు పడుతున్నాయి. ఒసాకాలో జూన్ 28, 29 తేదీల్లో జీ-20 సమ్మిట్ ను నిర్వహిస్తున్న జపాన్ ఈ సమస్యను ప్రధాన అజెండాగా ప్రస్తావనకు తీసుకురావచ్చు. తన ప్రతిపాదన ఆమోదయోగ్యమయ్యేలా ఇతర దేశాలను గట్టిగా ఒప్పించడానికి యత్నించ వచ్చు. జెనీవా బేస్డ్ మల్టీలేటరల్ ట్రేడ్ బాడీని సంస్కరించాలన్న తమ డిమాండులో భాగమే ఇదని జపాన్ చెప్పుకుంటోంది..ఒకవేళ ఈ ప్రతిపాదనకు అన్ని దేశాల ఆమోదం లభిస్తే. . వ్యవసాయ సబ్సిడీల విషయంలో ఇండియాకు ఊహించని దెబ్బే ఎదురుకావచ్ఛునని భావిస్తున్నారు.