టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

SMTV Desk 2017-08-27 16:18:27  India, Srilanka, ODI series, Third Odi, Pallekele odi

పల్లెకెల, ఆగస్ట్ 27: భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న ఐదు వన్డే మ్యాచ్‌‌ల సిరీస్‌లో భాగంగా నేడు పల్లెకెల వేదికగా మూడవ వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంకేయులు బ్యాటింగ్ ఎన్నుకున్నారు. అయితే గత రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌తో సిరీస్‌ సాధించడమే లక్ష్యంగా బరిలో నిలిచింది. దీంతో టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్ లో ఆడిన ఆటగాళ్లను ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించింది. మరో పక్క ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలనే పట్టుదలతో లంకేయులు ఉన్నారు. కాగా, రెండో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ పై వేటు పడటం లంకేయులకు మైనస్ పాయింట్.