కార్యాలయాల్లో ఫోటోలు పెట్టవద్దు.... వ్లాదిమర్‌

SMTV Desk 2019-05-29 11:03:25  Volodymyr Zelenskiy, krainian president

ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడిగా వ్లాదిమర్‌ జెలెన్స్‌కీ నూతనంగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. పదవి స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన దేశంలోని ఇతర ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తాను దేశాధ్యక్షుడినే గాని, చిత్రపటాన్ని గాని కాదని అన్నారు. ఈ నేపథ్యంలోని తన ఫోటోలను ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో పెట్టవద్దంటూ సూచించారు. కాగా ఆయన ఫోటోల బదులు తన పిల్లల ఫోటోలను గోడలపై ఉంచాలని ఆయన సూచించారు. ఆయన దేశాధ్యక్షుడు కాక ముందు ఒక టివి కమెడియన్‌గా పనిచేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని, అందరం కలిసి దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు.