కడుపులో 250 కొకైన్‌ ప్యాకెట్లు....వ్యక్తి మృతి

SMTV Desk 2019-05-29 11:01:46  Japanese man dies mid-flight with stomach full of cocaine Read more at https://www.channelnewsasia.com/news/world/japanese-man-dies-mid-flight-with-stomach-full-of-cocaine-11570894

వాషింగ్టన్‌: ఓ వ్యక్తి అక్రమంగా డ్రగ్స్ తరలిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా డ్రగ్స్‌ తరలిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడు కడుపులో సుమారు 250 కొకైన్‌ ప్యాకెట్లు నింపుకొని తాను నివాసం ఉంటున్న మెక్కికో నుండి కొలంబియాలోని బగోటాకు బయలుదేరాడు. అయితే అతడు తనిఖీల్లో ఎక్కడా దొరకుండా విమానం ఎక్కాడు. కానీ పొట్టలో ప్యాకెట్ల మోతాదు ఎక్కువవడంతో విమానం కుదుపులకు లోనైనప్పుడు కొకైన్‌ లీకై శరీరంలోకి ప్రవేశించింది. దీంతో తీవ్రమైన కడుపునొప్పి అంటూ అరవడం మొదటు పెట్టాడుసిబ్బంది అత్యవసరంగా విమానాన్ని దింపారు. స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీరా శవపరీక్ష చేసిన తర్వాత శరీరంలో కొకైన్ మోతాదు ఎక్కువవడంతో గుండెపోటు వచ్చి మరణించినట్లు తేలింది.