భారీ ఓటమి వైఫల్యంతో కుంగిపోతున్న కాంగ్రెస్ లీడర్

SMTV Desk 2019-05-29 10:42:27  Rahul Gandhi,

ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజాపాను దెబ్బతీసి తన న్యాయకత్వాన్ని నిరూపించుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉవ్విళ్ళూరారు. బాగా కష్టపడ్డారు. వందల నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేశారు. కానీ చివరికి తన కంచు కోట అమేఠీలోనే ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి ఆయన్ను బాగా కుంగదీసింది. ఎంతలా అంటే ఇకపై తాను అధ్యక్ష పదవికి అర్హుడని కాదని ఆయన డిసైడైపోయారు. ఏకంగా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.

కానీ ఆయన రాజీనామాను వర్కింగ్ కమిటీ నిరాకరించింది. ఓటమికి సమిష్టి భాద్యత తీసుకుని కష్టపడాలని సూచించింది. కానీ రాహుల్ మనసు మాత్రం మారలేదు. ఓటమి బాధ ఆయన్ని తొలచివేస్తోంది. 2014 కంటే ఈసారి కేవలం 6 సీట్లు మాత్రమే పెంచుకోగలిగింది ఆ పార్టీ. ఈ పెంపు రాహుల్ గాంధీకి సంతృప్తినివ్వలేదు సరికదా తన న్యాయకత్వం మీద తనకే అసహనం పుట్టేలా చేశాయి.

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే తాను తప్పుకున్నాక పదవిలోకి తన కుటుంబం నుండి సోనియా లేదా ప్రియాంక రావడానికి కూడా రాహుల్ ఇష్టపడటంలేదట. ఇన్నాళ్లు తమ కుటుంబం హస్తాల్లో ఉన్న పార్టీని ఈసారి బయటి వ్యక్తులకు అప్పగించాలని ఆయన భావిస్తున్నారట. మరి ఆయన ఆలోచనను వర్కింగ్ కమిటీ ఆమోదించి ఎవరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటుందో చూడాలి.