ఎండ తీవ్రతకి చేపల ప్రాణాలు విల విల

SMTV Desk 2019-05-29 10:41:19  Heat wave, fish, died

ఎండ తీవ్రతతో మనుషులే కాదు.. నీటిలోని చేపల ప్రాణాలు పోతున్నాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ చెరువులో పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. చెరువులో నీటి మట్టం తగ్గడం, పెరిగిన ఉష్ణోగ్రతతో నీరు వేడెక్కి రెండు టన్నులకుపైగా మరణించినట్లు మత్స్యకారులు చెప్పారు. సుమారు రూ. 3 లక్షల నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.