లాభాలను పెంచుకున్న గెయిల్

SMTV Desk 2019-05-28 16:57:33  gail

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్(గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా) నికర లాభం మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో రూ.1,122 కోట్లతో 9.92 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1020 కోట్లుగా ఉంది. సంస్థ మార్చి త్రైమాసిక నికర లాభాల్లో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. గ్యాస్ వ్యాపారంలో లాభాలు వస్తే, ప్రెట్రోకెమికల్ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. మొత్తం మీద జనవరి-మార్చి త్రైమాసికానికి రూ.1,222.23 కోట్ల లాభం వచ్చింది. ఈ మేరకు కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే 1:1 బోనస్ షేర్‌ను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. గెయిల్‌లకు పెట్రోకెమికల్ వ్యాపారం రూ.20 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.