బిహెచ్‌ఇఎల్ 49.33 శాతం పెరిగిన లాభాలు

SMTV Desk 2019-05-28 16:56:51  bhel

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ బిహెచ్‌ఇఎల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో రూ.682 కోట్లతో 49.33 శాతం పెరిగింది. పోయిన ఏడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.457 కోట్లుగా ఉంది. గతంలో రూ.9,832.82 కోట్ల విక్రయాలు ఉండగా, తాజాగా రూ. 9,836.50 కోట్లకు పెరిగాయి. మరోవైపు ఇతర వ్యయాలు రూ. 1896 కోట్ల నుంచి రూ. 1081 కోట్లకు దిగివచ్చాయి. పన్నుకు ముందు లాభంలో 12.76 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది రూ. 1140 కోట్లున్న పిఎటి ఇప్పుడు రూ. 1285.43 కోట్లను చేరింది. మొత్తం ఆర్ధిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ. 1.20 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. స్టాక్‌మార్కెట్లో కంపెనీ షేరు విలువ రూ.5.36 శాతం లాభపడి రూ.72.70కు చేరింది.